Friday, January 22, 2021

Latest Posts

ఆ నిందితులకు క్షమాభిక్ష తిరస్కరణ

నిర్భయ దోషులకు ఈ నెల 22 ఉదయం ఏడు గంటలకు ఉరిశిక్ష అమలవుతుందా? లేదా అనే అంశంపై పెద్ద ఎత్తున సందేహం నెలకొంది. మరోపక్క ఉరి వాయిదా పడనుందన్న మాట నోట వినిపిస్తోంది. అయితే.. ఈ అంశంపై క్లారిటీ వచ్చేసింది. నిర్భయను అతి పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి.. ఆమె మరణానికి కారణమైన దోషలకు ఇప్పటికే మరణించే వరకూ ఉరిశిక్షను అమలు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. వారికి ఉరిశిక్ష విదించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో వినయ్ శర్మ.. ముఖేశ్ సింగులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది.

దీంతో ఏకైన ఆప్షన్ గా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. దీన్ని తిరస్కరిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తాజా గా నిర్ణయం తీసుకోవడంతో వారికి ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 22న వారికి ఉరిశిక్షను అమలు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఉరి శిక్ష విధించాక, ఉరిని అమలు కాకుండా ఆపేందుకు ఆఖరి అవకాశంగా ఉన్న క్షమాభిక్ష పిటిషన్ ను దేశ ప్రధమ పౌరుడికి అందజేశారు. ప్రోటోకాల్ ప్రకారం.. తొలుత దోషి క్షమాభిక్ష పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి పంపారు.

అయితే ఆ పిటిషన్ ను తిరస్కరించాలని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. అదే విషయాన్ని అక్కడి లెఫ్టెనెంట్ గవర్నర్ కు విన్నవించడంతో ఆయన క్షమాభిక్షను వ్యతిరేకించారు. ఇదే సమయంలో దోషుల క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతికి పంపగా.. ఆయన ఆ పిటిషన్ ను రిజెక్టు చేసారు. సుప్రీం కోర్టు కూడా రిజెక్టు చేసింది. ఈ నేపథ్యంలో తీహార్ జైల్లో ఖైదీల్ని ఉంచే జైలు నుంచి ఉరితీసే ముందు మార్చే మూడో నెంబరు జైలుకు ఖైదీల్ని తరలించారు. దీంతో ముందే అనుకున్నట్లుగా ఉరిశిక్ష అమలు చేసే వీలుందని తేలిపోయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss