Wednesday, October 21, 2020

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

తీగ లాగితే డొంక కదిలిందా … కరోనా కేసుల కలకలం

A disturbance of corona cases in nizamuddin religious meet:

విదేశాలనుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా కరోనా వైరస్ వచ్చిందన్నది నిజం. అయితే  విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి దేశ వ్యాప్తంగా ఏదైనా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారా? ఆ కార్యక్రమంలో పాల్గొన్న  వారు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అనే అంశానికి సంబంధించిన వార్నింగ్ బెల్  మోగింది. గత శుక్రవారం రాత్రి వేళలో లకడ్డీకాపూల్ లోకి ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి  వచ్చిన ఫోన్ కాల్ తో వైద్య అధికారులు అలెర్ట్ అయ్యారు. ఒక పెద్ద వయస్కుడు మరణించారని.. ఆయన ఎదుర్కొన్నవన్నీ కరోనా లక్షణాలతో మ్యాచ్ అయ్యాయని.. అయితే..అతడికి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేదని చెప్పటంతో.. పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆసుపత్రి నుంచి ఫోన్ రావటంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వెళ్లి మరణించిన వ్యక్తిని గాంధీకి తరలించి.. పరీక్షలు జరిపారు.

అనూహ్యంగా సదరు వ్యక్తి కరోనాతో మరణించినట్లు గుర్తించారు.ఒక్కసారి ఉలిక్కిపడిన తెలంగాణ ప్రభుత్వం,  అతడి ట్రావెల్ హిస్టరీ మీద ఆరా తీసిందట.  ఈ నెల 13-15 మధ్యన ఢిల్లీలోని నిజాముద్దీలో భారీ ఎత్తున మర్కజ్ ప్రార్థనలు జరిగినట్లుగా గుర్తించారు. దీనికి మొత్తం 75 దేశాల నుంచి ఎనిమిదివేల మంది వరకూ హాజరైనట్లుగా గుర్తించారు. ఇండోనేషియా.. మలేషియా.. సౌదీ.. కజకిస్థాన్ ఇలా చాలా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలా హాజరైన విదేశీయుల సంఖ్య ఏకంగా రెండు వేలుగా చెబుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలనుంచి భారీగానే ఉన్నారట.  అయితే అక్కడ  ప్రార్థనలు ముగిసిన తర్వాత కూడా పలువురు ప్రార్థనలు నిర్వహించిన వేదిక దగ్గర్లోనే బస చేశారని.. ఆరు అంతస్తుల డార్మటరీల్లో 280 మంది విదేశీయులు ఉన్నట్లుగా తేలింది. అక్కడున్న మొత్తం 300 మందికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది.  అనారోగ్యంగా ఉన్న 75 మందిని ఆదివారమే ఢిల్లీలో గుర్తించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి..ఒకేచోట వందల మంది ఎలా ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అంతేకాదు, ఈ ప్రార్థనలు జరిగిన స్థలం నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ను అనుకునే ఉంది. ఇప్పుడీ చుట్టుపక్కల ప్రాంతాల్ని చుట్టుముట్టిన పోలీసులు, ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 200 మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రార్థనలకు తెలంగాణ నుంచి దగ్గర దగ్గర 300 మంది హాజరైతే, ఏపీ నుంచి దగ్గర దగ్గర 500 మంది పైనే హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఉన్న అంచనాలు మారిపోయి.. కొత్త ఆందోళన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మొదలైంది. ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు.. గడిచిన కొద్ది రోజులుగా ఎక్కడెక్కడ సంచరించారు,అసలు ఎంతమంది వంటి లెక్కలు తీస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...