దేశాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే పశ్చిమ భారతాన్ని మిడతలు చుట్టుముట్టాయి. పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలపై వీటి ప్రభావం విపరీతంగా ఉంది. దేశ రాజధాని దిల్లీకి వీటి ముప్పు తప్పేలా లేదని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. మిడతలకు ఎలాంటి పంట అనేది సంబంధం ఉండదు. పచ్చగా ఏది కనపడితే దాన్ని శుభ్రంగా ఆరగించేస్తాయి.
పశ్చిమ భారతంలో పంటపొలాలపై దాడి చేస్తున్న మిడతలు మన ఇంటి పరిసరాల్లో చూసే మిడతల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే మన ఇంటి వద్ద ఒకటి రెండు మిడతలు కనపడితే, అక్కడ మాత్రం వేలు, లక్షల సంఖ్యలో ఒక్కసారిగా వస్తాయి. పశ్చిమ భారతంలో పంటపొలాలపై దాడి చేస్తున్న మిడతలు మన ఇంటి పరిసరాల్లో చూసే మిడతల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే మన ఇంటి వద్ద ఒకటి రెండు మిడతలు కనపడితే, అక్కడ మాత్రం వేలు, లక్షల సంఖ్యలో ఒక్కసారిగా వస్తాయి. మిడతల దండును ఇప్పుడు నియంత్రించలేకపోతే 8వేల కోట్ల విలువైన పెసరపంట నాశనం అవుతుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: