ప్రపంచంలో కరోనా వల్ల లాక్డౌన్ ను అమలుచేస్తున్నాయి. దాంతో అందరూ ఇంటికే పరిమితమై ఉండటంతో ప్రభుత్వ , ప్రైవేట్ రంగా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం కు ప్రదాన్యం ఇస్తున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మీటింగులు చేసుకుంటున్నారు. ఇలాగే ప్రస్తుత పరిస్థితులపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే, ఈ వీడియో కాన్ఫరెన్స్ జరుగు తున్నపుడు అందులో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించాడు. తన కెమెరా బంద్ చేయకుండానే స్నానం చేస్తున్నట్లు దర్శనమిచ్చాడు.
దీంతో అతనికి సంబంధించిన దృశ్యాలు అధ్యక్షుడితోపాటు అందిరికంటా పడ్డాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ సావో పాలో అధ్యక్షుడు పాలో స్కాఫ్ మాట్లాడుతున్న సమయంలో బాల్సోనారో ఆ దృశ్యాన్ని గమనించారు. ఆ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, పాలో అక్కడ మూలకు ఉన్న బాక్సులో కనిపిస్తున్న వ్యక్తి సరిగ్గానే ఉన్నాడా లేదా.. ? అని ప్రశ్నించారు. ‘అక్కడ ఓ వ్యక్తి బట్టలులేకుండా స్నానం చేస్తున్నాడు. ఈ సమావేశంలో వాడి వేడి చర్చ జరుగుతున్న క్రమంలో అతడు చల్లబడేందుకు ఇలా చన్నీటి స్నానం చేస్తున్నాడు’ అని పరిశ్రమల శాఖ మంత్రి పాలో గ్యూడెస్ అధ్యక్షుడికి సమాధానం చెబుతూ ఛమత్కరించారు.
ఇది కూడా చదవండి: లాక్ డౌన్ 4.0 లో ఏం మారాయి? ఏం మారలేదు?