A pizza delivery boy who kept 72 families in his home quarantine
ఢిల్లీ లో బుధవారం ఒక డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. గడిచిన కొన్ని రోజులుగా అతడు ఫుడ్ డెలివరీ సుమారు 72 కుటుంబాలను క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ పిజ్జా సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా అతనికి ఆరోగ్యం బాగో లేక పోయేన అతడు నిత్యం పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లే వాడు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పరీక్షలు చేయగా మంగళవారం పాజిటివ్ అని తేలింది. దాంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు అధికారులు అతడితోపాటు పనిచేసిన మరో 16 మందిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. వారితో పాటు అతను ఫుడ్ డెలివరీ చేసిన ఇళ్ల వివరాలను సేకరించగామొత్తంగా 72 కుటుంబాలను గుర్తించి వారిని కూడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించారు. అయితే డెలివరీ బాయ్స్ ముఖానికి మాస్కులతోనే విధులు నిర్వర్తించారని, కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన పనిలేదని అధికారులు సూచిస్తున్నారు.