Friday, January 22, 2021

Latest Posts

హమ్మయ్య ‘కల్పనకు’ కరోనా లేదు

A rare white female tiger has died at the zoo in Delhi

ఈ కరోనా మహమ్మారి వేళ అన్నీ భయంగానే ఉన్నాయి. తాజాగా  దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని జంతుప్రదర్శనశాలలో అరుదైన తెల్లరంగు ఆడపులి మరణించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఢిల్లీ జూలోని అరుదైన కల్పన అనే ఆడపులి మరణించడం తో అందరూ ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన  సంచలనం రేపింది. నిజానికి  తీవ్ర అనారోగ్యానికి గురైన ఆడపులి కిడ్నీ ఫెయిలై మృత్యువాత పడింది.

కానీ  మరణించిన పులికి కరోనా వైరస్ సోకిందేమోనని జూ సిబ్బంది ఆందోళన చెందారు. కరోనా ప్రబలుతున్న కాలంలో ముందుజాగ్రత్తగా ఆడపులి కళేబరం నుంచి శాంపిల్ ను సేకరించి బరేలీలోని భారతీయ పశుసంవర్థక పరిశోధనా సంస్థకు పంపించి పరీక్షించారు. కల్పన ఆడపులి కళేబరాన్ని అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకొని దహనం చేశారు.

పులి స్వాబ్ లను పరీక్షించగా కరోనా నెగిటివ్ అని వచ్చింది.  మరణించిన పులికి కరోనా వైరస్ సోకలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలో పులులకు కరోనా సోకడంతో మనదేశంలో అన్ని జంతు ప్రదర్శన శాలల్లో ముందస్తు చర్యలు చేపట్టారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss