Sunday, February 28, 2021

Latest Posts

మళ్ళీ వాయిదా పడిన ఎ1 ఎక్స్‌ప్రెస్

A1 Express Release Date Changed

యంగ్ టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తన మైలురాయి చిత్రం 25వ సినిమా కోసం కొత్త తరం స్పోర్ట్స్ ఎంటర్టైనర్ “ఎ1 ఎక్స్‌ప్రెస్” ను ఎంచుకున్నాడు. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో మొట్ట మొదటి సారిగా హాకీ నేపథ్యంలో సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం వేచి చేస్తున్న అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం మార్చి 5 న థియేటర్లలోకి రానుంది. అంతకుముందు ఈ చిత్రం ఫిబ్రవరి 26 న విడుదల కావాల్సి ఉంది, అయితే ఈ చిత్రం చెక్ తో పోటీ నుంచి తప్పుకుని మార్చ్ ఐదున ప్రేక్షకుల ముందుకి రానుంది.

సందీప్ కిషన్ ఈ చిత్రం కోసం చాలా కష్ట పడ్డాడు తన బాడీ మొత్తం మలుచుకొని సిక్స్ పాక్ చేశాడు. అలానే కొన్ని నెలలు హాకీలో శిక్షణ కూడా పొందాడు. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది.  ఎ1 ఎక్స్‌ప్రెస్ లో లావణ్య త్రిపాఠి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss