Home సినిమా వార్తలు నేడు అందాల తార ఆర్తి అగర్వాల్ వర్ధంతి

నేడు అందాల తార ఆర్తి అగర్వాల్ వర్ధంతి

Aarthi Agarwal Death Anniversary, Tollywood Heroine Aarthi Agarwal, Tollywood Heroine, Aarthi Agarwal Death Anniversary, Death Anniversary

ఒకప్పుడు తెలుగుతో పాటు పలు సౌతిండియన్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి లైపోసక్షన్ సర్జరీ చేయించుకోగా అది వికటించి 2015 జూన్ 6 మరణించింది. 31 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం ముగిసింది. అమెరికాలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఆమె. ఆర్తి అగర్వాల్ అందం, అభినయం, చలాకీ తనంతో ఇట్టే ఆకర్షించే రూపం. పుట్టింది అమెరికాలో అయినా అచ్చం మన సాంప్రదాయపు అమ్మాయే అనేలా ఉండే రూపం. నటుడు, నిర్మాత సునీల్‌శెట్టి ఓసారి అమెరికా వెళ్లినప్పుడు ఆర్తిని చూసి ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా నగరాల్లో ఆమెతో నృత్య ప్రదర్శనలు ఇప్పించాడు.

ఆ కార్యక్రమాలకు బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సునీల్‌శెట్టితో పాటు బిగ్‌-బి కూడా ఆర్తి ప్రదర్శనకు ముచ్చటపడి బాలీవుడ్‌కు ఆహ్వానించారు. అలా ఆర్తికి మంచి నటిగా ఎదగాలని కలలు మొదలయ్యాయి. అలా14 యేళ్లకే అమితాబ్ సలహాతో బాలీవుడ్ లో కెరీర్ ను స్టార్ట్ చేసింది ఆర్తి.  తర్వాత తెలుగుకు షిఫ్ట్ అయిన ఆర్తి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. నువ్వు నాకు నచ్చావ్ నుండి సోగ్గాడు సినిమా వరకు ఆర్తి కాల్షీట్స్ కోసం వెయిట్  చేసిన నిర్మాతలు చాలా మందే ఉన్నారు.

ఇది కూడా చదవండి: కరోనా తో మరణించిన బాలీవుడ్ ప్ర‌ఖ్యాత నిర్మాత

అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఆర్తి అగర్వాల్ న్యూజెర్సీలో పుట్టి పెరిగింది. 16 యేళ్ల వయసులో 2001 లో విడుదలైన బాలీవుడ్ మూవీ పాగల్‌పన్ తో ఇండియా సినిమాలలో అడుగుపెట్టింది. వెంకటేస్ సరసన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. నువ్వు నాకు నచ్చావ్ ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో భారీ అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మరియు నాగార్జునలతో పాటు మహేష్ బాబు, జూ ఎన్టీయార్, తరుణ్ లతో నటించింది. బి.గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది. వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

అవి నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి. ఇది ఆమె విజయ గాథ. వరుస హిట్లతో ఒక స్థాయికి చేరిన ఆమె.. మరోపక్క ప్రేమ భగ్నం కావడం..స్టార్ డం పోవడం ఆమెను క్రుంగ తీశాయి. ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యా ప్రయత్నం. ఇదే ప్రయత్నం స్టార్ మీరోయిన్ అయిన తనను అధ: పాతాళానికి తోసేసింది. హీరో తరుణ్ తో ప్రేమాయణమే ఆత్మహత్యకు కారణమా..? కాదా అనేది పక్కన పెడితే సాఫీగా సాగుతున్న ఆర్తి కెరీర్లో అధి ఒక పిడుగు పాటు అని చెప్పవచ్చు. తరుణ్ ప్రేమ వ్యవహారం నిజమే అని అప్పట్లో సినీ ఇండస్ట్రీ కూడా కోడై కూసింది. ఆత్మహత్య ప్రయత్నం అన్న మాట విన్నప్పడి నుండి ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి. కాల్షీట్ల కోసం వెయిట్ చేసిన  నిర్మాతలు సైతం, అప్పుడు చూసీ చూడనట్టు వ్యవహరించారు.

ఇది కూడా చదవండి: బాలయ్యను ఆహ్వానించాం.. కానీ …

కొంతకాలం తర్వాత ఉజ్వల్‌ కుమార్‌ను హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో 2007 నవంబరు 21న వివాహమాడింది. హరియాణాకు చెందిన ఉజ్వల్‌ కుమార్‌ కుటుంబీకులు ఆర్తి కుటుంబానికి దూరపు బంధువులు. పెళ్లి చేసుకునే సమయంలో ఆర్తి సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన గోరింటాకు సినిమాలో నటిస్తోంది. ఆర్తి-ఉజ్వల్ వివాహ జీవితం ఎంతో కాలం నిలువలేదు. అయితే వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అభినయం లేకపోయినా అందమే ముఖ్యం అన్నట్టుగా మారింది సినీ ఇండస్ట్రి  ,కానీ ఆఫర్లు లేని ఆర్తి బరువు పెరిగింది.

అలాంటి సమయంలో తన కెరీర్ కు,తన బరువే పెద్ద మైనస్ అని తలచింది. ఆపరేషన్ చేయించుకొని సెకెండ్ ఇన్నింగ్స్ అయినా  సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంది. కానీ విధి వక్రీకరించింది. అనంతలోకాలకు పయనమయ్యింది ఆర్తి. ఇది ఆమె విషాదగాథ. ఆర్తీ అగర్వాల్ జీవితం యువతకి ఒక పాఠం. చిన్న వయసులోనే అందాలతారగా అందలం ఎక్కినా ఆర్తీ అగర్వాల్ అదే చిన్నవయసులోనే అందర్నీ వదిలి పోయింది. జీవితంలో ఫెయిల్ అయ్యానని మరణాన్ని ఆహ్వానించినా రాని మృత్యువు.. జీవితాన్ని అర్థం చేసుకుని.. పాజిటివ్ ధృక్పథంతో ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్తిని తీసుకువెళ్లిపోవడమే పెద్ద విషాదం. ఆమె ఆత్మకు మన శాంతి కలగాలని కోరుకుందాం.

ఇది కూడా చదవండి:

 భయం గుప్పెట్లో భాగ్యనగరం

పసిడి ప్రియులకు శుభవార్త

 

Exit mobile version