Tuesday, January 25, 2022

Latest Posts

నేడు అబ్దుల్ కలాం 7వ వర్ధంతి

భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణించి నేటితో 6 ఏళ్ళు పూర్తి అయ్యాయి. అబ్దుల్‌ కలాం 1931వ సంవత్సరం అక్టోబర్‌ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులాబ్దిన్‌, ఆసియామ్మ దంపతులకు జన్మించారు. అయితే  కలాం కుటుంబం పేదరికంలో ఉండడంతో చిన్న తనం నుండే తన అవసరాలకు పేపర్ బాయ్ గా పని చేశారు. తరువాత 1960 సంవత్సరంలో” ది మద్రాస్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ” నుంచి అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ పట్టా పొందిన అనంతరం డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరి ఆ తరువాత ఇస్రోలో కూడా ఆయన తన సేవలు అందించారు. 1963 సంవత్సరం తర్వాత పలు దేశాల్లో పర్యటించారు. బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్‌ డెవిల్‌, ప్రాజెక్ట్‌ వాలియంట్‌లలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే భారత అణు పరీక్ష కేంద్రంలో కీలకంగా పనిచేసారు. అరవైవ దశకంలో చైనా, పాకిస్థాన్ లతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తూ ఉండేది ఆ సమయంలో భారత రక్షణ రంగం మరింత పటిష్టంగా ఉండాలని కలాం గుర్తించారు.1970 దశకంలో బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేయాలనే సంకల్పాన్ని అబ్దుల్ కలాం వెల్లడించారు. ప్రాజెక్ట్‌ డెవిల్‌, ప్రాజెక్ట్‌ వాలియంట్‌లకు రూపకల్పన చేసి ఆ ప్రోజెక్టుల విషయం లో అబ్దుల్ కలాం విశేషమైన సేవలందించారు. 1997వ సంవత్సరంలో ఆయనను భారతరత్న వరించింది. ఇక భారత దేశానికి 2002 నుండి 2007 సంవత్సరం వరకు 11వ రాష్ట్రపతిగా కలాం విశేష సేవలు అందించారు.

1960 సంవత్సరంలో” ది మద్రాస్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ” నుంచి అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరి ఆ తరువాత ఇస్రోలో కూడా ఆయన తన సేవలు అందించారు. 1963 సంవత్సరం తర్వాత పలు దేశాల్లో పర్యటించారు. బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్‌ డెవిల్‌, ప్రాజెక్ట్‌ వాలియంట్‌లలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే భారత అణు పరీక్ష కేంద్రంలో కీలకంగా పనిచేసారు. అరవైవ దశకంలో చైనా, పాకిస్థాన్ లతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తూ ఉండేది ఆ సమయంలో భారత రక్షణ రంగం మరింత పటిష్టంగా ఉండాలని కలాం గుర్తించారు. ఇందుకోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆ సమయం లో కలాం ఇస్రోలో సేవలు అందిస్తూ ఉండేవారు. ఆ సమయంలో పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి-3 వంటి ప్రాజెక్టులను రూపొందించడంలో కలాం ఎంతగానో కృషి చేసారు.  ఆయన 83 ఏళ్ళ వయసులో 2015వ సంవత్సరం జులై 27వ తేదీన షిల్లాంగ్‌ లోని ఐఐఎంలో ప్రసంగిస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దేశానికి అబ్దుల్ కలాం సేవలు మరవలేనివి. యువత ప్రతి ఒక్కరు కూడా ఆ మహానువాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. నేడు అబ్దుల్ కలాం 7వ వర్ధంతి సందర్భంగా 99తెలుగు చానల్ తరుపున ఆయనకు ఇవే మా ఘన నివాళులు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss