Sunday, May 16, 2021

Latest Posts

అందని ఆర్ధిక సహాయం

Helpless financial support

లాక్ డౌన్ వల్ల రోజు కూలీలపై  ఆర్ధికభారం పడింది. రోజు వారు పనికి వెళ్తే గాని రోజు గడవదు. ఈ  నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రకల కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో బాగంగానే రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సాయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే, అయితే కృష్ణ అనే వ్యక్తి తనకు ఆర్థిక సాయం అందట్లేదని తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉరవకొండలో సచివాలయం ముందు బైఠాయించాడు.  ఆయన ఉరవకొండ పట్టణంలోని పదో వార్డులో ఉంటానని, తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇస్తా అన్న రూ.1000 ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రం లో ఇలాగే చాలా మందికి అందలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss