Sunday, June 20, 2021

Latest Posts

ఆచార్య అభిమానులకు ఊరటనిచ్చే విషయం

Acharya Movie News Update
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా వాయిదా పడిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకి రావాలి కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్ర విడుదల తేదీ వాయిదాపడింది.

ఆచార్య చిత్ర బృందానికి కూడా కరోనా సోకింది. ముందుగా నటుడు సోనూ సూద్ కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పూజా హెగ్డే కు కూడా కరోనా సోకింది. దీనితో చిత్ర బృందం మొత్తం హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అలా నిర్ధాంతరంగా ఆగిపోయిన ఆచార్య షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు.

అయితే అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఇప్పుడు బయటకి వచ్చింది. అదేంటంటే ఈ చిత్ర షూటింగ్ ఇంకా 10 రోజులు చేస్తే పూర్తి అయిపోతుందట. ప్రస్తుత సమాచారం ప్రకారం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఆ 10 రోజుల షూటింగ్ ను పూర్తిచేసి, అప్పుడు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారట. అయితే మెగా అభిమానులు మాత్రం ఈ చిత్ర విడుదల తేదీ కోసం కాస్త వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss