Tuesday, April 13, 2021

Latest Posts

ఆచార్య సినిమా విడుదల పోస్ట్ పోన్ కానుందా

Acharya Movie Release Date
కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నిర్మాతలు షూటింగ్ ఆపివేస్తున్నారు. అనేక ప్రొడక్షన్స్ ఇప్పటికే జాగ్రత్తతో వారి షూట్ షెడ్యూల్ను రద్దు చేశారు. ఇప్పుడు కొన్ని సినిమాలు విడుదల తేదీలను కూడా పునరాలోచించుకుంటున్నాయి. అలాంటి సందిగ్దంలోనే ఉంది మెగాస్టార్ చిరంజీవి యొక్క “ఆచార్య” చిత్రం.

కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మించిన “ఆచార్య” మే 13 న తెరపైకి రానుంది. మొదటి పాట “లాహి లాహి” ఇప్పటికే 13 మిలియన్ల వ్యూస్ ని సాధించి ట్రెండింగ్ లోకి వెళ్లింది. కానీ మేకర్స్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లకు విరామం ఇచ్చారు. నిర్మాత మరియు దర్శకుడు కొరటాల శివ విడుదల తేదీ “వకీల్ సాబ్” ఫలితాన్ని చూసి నిర్ణయించాలనుకుంటున్నారు.

కోవిడ్ కేసులు పెరిగినప్పటికీ ప్రజలు పవన్ కళ్యాణ్ సినిమా చూడటానికి థియేటర్లకు వస్తే, “ఆచార్య” కూడా షెడ్యూల్ ప్రకారం అదే రోజు తెరపైకి వస్తుంది. ఒక వేల ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోతే లేదా ప్రభుత్వాలు ఏదైనా కొత్త ఆంక్షలు విధించినట్లయితే, “ఆచార్య” విడుదల తేదీలో మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది. “ఆచార్య” మెగాస్టార్ చిరంజీవి యొక్క 152 వ చిత్రం. ఇందులో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss