Acharya Release Date Confirmed
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. అయితే ఇప్పుడు ‘ఆచార్య’ థియేటర్స్‌లోకి వచ్చే తేదీని ఫిక్స్ చేసుకున్నట్టు టాలీవుడ్ కోడై కూస్తుంది. ‘ఆచార్య’ను సమ్మర్లో థియేటర్స్‌లోకి తీసుకోస్తున్నట్టు సమాచారం. వేసవి సెలవుల్లో మే 9న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇంతకముందే ఈ తేదీని ప్రకటించినప్పటికీ కరోనా రాకతో సినిమా ఆగిపోతుందని అంతా భావించారు.
అయినప్పటికీ చిరంజీవి నటించిన మెగాహిట్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మే 9న థియేటర్స్‌లోకి రావడంతో ఆ రోజే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న ఈ ఆచార్యలో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: