Sunday, June 20, 2021

Latest Posts

ఆచార్య సినిమా నుంచి లీక్ అయిన సాంగ్

Acharya Song Leaked Online

పెద్ద సినిమాలు మేకింగ్ దశలో ఉండగానే అందులోని సన్నివేశాలను పాటలను ఆన్ లైన్లో లీక్ చేసేయడం పెద్ద బెడదగా మారిపోతోంది చిత్ర బృందానికి. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఎంత కట్టడి చేసినప్పటికీ, సినిమాలోని కంటెంట్‌ను లీక్ అవ్వడం జరుగుతోంది. మొన్నటి ‘బాహుబలి’ నుంచి నిన్న ‘వకీల్ సాబ్’ దాకా చాలా చిత్రాలకు ఈ సమస్య తప్పలేదు.

తాజాగా ‘ఆచార్య’ టీంకు ఈ బెడద తప్పలేదు. ఆ సినిమా నుంచి తాజాగా ఒక పాట లీక్ అయ్యింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మధ్యే వీళ్లిద్దరిపై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించారు. ఇప్పుడు ఆ పాటే ఆన్ లైన్లో లీక్ అయ్యిందని సమాచారం.

అయితే ఎవరు, ఎలా లీక్ చేశారన్నది తెలియట్లేదు కానీ.. ఈ పాట విన్నవాళ్లందరూ చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది ట్రెండ్ అవుతోంది. ఈపాటికి ‘ఆచార్య’ సినిమాలో చరణ్, పూజా హెగ్డే పార్ట్ అంతా షూటింగ్ అయిపోవాల్సింది కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss