Actor Ajaz Khan arrested mumbai police over comments on Facebook
శనివారం ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన సినిమా నటుడు ఎజాజ్ ఖాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇతడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్శకులకు సుపరిచితుడే, అలాగే బిగ్బాస్-7లో కంటెస్టెంట్ గా కూడా ఇతను పటిస్పాట్ చేశాడు. ఇంతకు ఎజాజ్ ఖాన్ ఇమిచ్చేశాడంటే ఫేస్ బుక్ లైవ్ ద్వారా రెండు వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ఎజాజ్ ఖాన్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు.
పోలీసులు అందువల్ల సెక్షన్ 135ఏతో పాటు పలు సెక్షన్ల క్రింద అతనిపై కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని అన్నారు. మొదటగా సమన్లు జారీ చేసిన పోలీసులు ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. కాగా ఎజాజ్ ఖాన్ ఇప్పటికే గతేడాది జులైలోనూ ఓ సారి అరెస్ట్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఇలా. అప్పుడు కూడా రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్న ఒక వీడియోలను పోస్ట్ పెట్టి నందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే డ్రగ్స్ వాడినందుకుగానూ అక్టోబర్ 2018లో ఓసారి అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.