Actor Prabhas Gives 4 Crore For Fight Against COVID-
మహమ్మారి కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు టాలీవుడ్ స్టార్స్ హర్షం వ్యక్తంచేస్తూ తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,పవన్ కళ్యాణ్,మెష్ బాబు ,నితిన్ తదితరులు విరాళాలు ప్రకటించారు. తాజాగా కరోనా నివారణ చర్యల నిమిత్తం ముందు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి రూపాయలు ప్రకటించారు. రూ. కోటి విరాళం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఇవ్వనున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే ఆయన ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 కోట్ల విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు అధిక విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్ రికార్డును ప్రభాస్ బీట్ చేశారు .
ఇక అల్లు అర్జున్ తన విరాళం ప్రకటించారు. రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో రూ.50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అలాగే రూ.25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్టు అల్లు అర్జున్ తెలిపారు. మొత్తం ఒక కోటి25లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.20 లక్షల విరాళాలన్ని ప్రకటించారు. ఇది పరీక్షా సమయం కరోనా వైరస్‌ను మనం అందరం ఎదుర్కోవాలి. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా శ్రమిస్తున్నాయంటూ వారు తెలిపారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5 లక్షలు చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు.ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు