Monday, October 25, 2021

Latest Posts

పెళ్లి పీటలెక్కనున్న త్రిష, పెళ్లి ఎవరితో అంటే

Actress Trisha Marriage

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటులలో ఒకరు త్రిష. అయితే చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు తమిళంలో సెటిల్ అయ్యింది. ఉమెన్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుని విజయాల బాట పట్టింది. ఈ మధ్యనే, ఆమె పరమపదం చిత్రం ఓటిటీలో విడుదల అయ్యి మంచి రివ్యూలను తెచ్చుకుంది.

కొన్నేళ్ళ క్రితం త్రిష ప్రేమలో పడ్డాడని పుకార్లు వచ్చాయి. ఆమె వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డాదని మరియు అతనితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసింది. వివాహం వరకు వెళ్ళిన ఈ జంట, నిశ్చితార్థం తరువాత కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోయారు. ఇక ఆ తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి ఊసు ఎత్తలేదు. అయితే తాజాగా త్రిష పెళ్లి చేసుకోవాలని సీరియస్ గా యోచిస్తుందట.

ఈ క్రమంలోనే మరో సారి బిజినెస్‏మెన్‏తో పెళ్లికి సిద్ధమైందట ఈ అమ్మడు. వీళ్లిద్ధరి పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఈ సంబంధంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే త్వరలోనే త్రిష వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లే.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss