Monday, July 26, 2021

Latest Posts

బాహుబలి కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఆది పురుష్

Adipurush To Beat Baahubali

పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్‌, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో కలిసి ఒక పెద్ద బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ కోసం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆదిపురుష్ ప్రాజెక్ట్ చుట్టూ భారీ  అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ 2020 ఆగస్టులో ఆవిష్కరించబడినప్పటికీ, ఈ చిత్రం ఫిబ్రవరి 2 న సెట్స్ లోకి వెళ్ళింది. కాని తరువాత కరోనావైరస్ యొక్క సెకండ్ వేవ్ కారణంగా షూట్ ఆగిపోయింది.

టి-సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించనున్నాడు. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, విపిఎక్స్ షాట్ల పరంగా ఆదిపురుష్ బాహుబలిని ఓడించబోతుంది.

ఇక ప్రభాస్ కి జోడీగా కృతి సనన్ నటించబోతుంది. ఇక ఇందులో ప్రభాస్, కృతి రాముడు మరియు సీత గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాని 400 కోట్ల రూపాయల బడ్జెట్‌లో తెరకెక్కనుంది. ఈ చిత్రం బడ్జెట్  విఎఫ్ఎక్స్ షాట్స్ కోసం పెద్ద మొత్తం ఖర్చు చేయబడుతుంది. ఈ చిత్రం యొక్క గ్రాఫిక్స్పై పని చేయడానికి మేకర్స్ ఇప్పటికే స్టార్ వార్స్ మరియు అవతార్ కి పని చేసిన వారిని తీసుకు వస్తున్నట్లు తెలుస్తుంది.

ఆదిపురుష్ 8000 విఎఫ్ఎక్స్ షాట్లను కలిగి ఉంటుందని, ఇది ఎస్ఎస్ రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ బాహుబలిలో ఉపయోగించిన విఎఫ్ఎక్స్ షాట్ల సంఖ్య కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ అని వర్గాలు చెబుతున్నాయి. బాహుబలిలో 2500 వీఎఫ్‌ఎక్స్ షాట్లు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇందులో 8000 షాట్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss