Monday, July 26, 2021

Latest Posts

ఆదిపురుష్ వల్ల సూపర్ హిట్ సినిమా ఛాన్స్ ని కోల్పోయిన ప్రభాస్

Aditya Chopra Removed Prabhas From Dhoom 4

ప్రభాస్ యొక్క మొట్టమొదటి పౌరాణిక చిత్రం, ఆదిపురుష్ షూట్ ముంబైలో తిరిగి ప్రారంభమైంది. అయితే, రాధే శ్యామ్ మరియు సాలార్‌ షూటింగ్ ఇంకా పూర్తి చేయాల్సి ఉండటంతో ప్రభాస్ ఆది పురుష్ సెట్స్ లో జాయిన్ కావడానికి సమయం పడుతుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రభాస్ సెప్టెంబర్ నెలలో ఆదిపురుష్ సెట్స్‌లో చేరే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాలు చేయడం వల్ల ప్రభాస్ ఒక సూపర్ హిట్ సినిమాని కోల్పోయాడు. అదే  యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ధూమ్ 4. ఈ చిత్రం కోసం ముందుగా ఆదిత్య చోప్రా ప్రభాస్‌ను అనుకున్నారు. అయితే పౌరాణికం చేస్తున్న వ్యక్తిని ఈ సినిమాలో దొంగగా చూడటం ప్రేక్షకులకు నచ్చదని ఈ సినిమా నుంచి ప్రభాస్ రోల్ ని వేరే వారికి ఇవ్వబోతున్నాడు ఆదిత్య చోప్రా.

ఇప్పటికే జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ బాలీవుడ్ హీరోలు చేసిన ఈ చిత్రంలో ధూమ్ 4 కోసం ఎవరు చేస్తారు అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss