Sunday, June 20, 2021

Latest Posts

ప్రేమలో మునిగి తేలుతున్న అడివి శేష్

Adivi Sesh Is In Love With Hyderabad Girl

తెలుగులో జేమ్స్ బాండ్ సినిమాలు చేసే హీరో ఎవరు అంటే మనకు గుర్తొచ్చేది అడివి శేష్. ఈ యంగ్ హీరో తన ప్రత్యేకమైన కథ ఎంపికతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ఇతను నటన మాత్రమే కాకుండా, తన సినిమాలకు కథలను కూడా రాస్తూ ఉంటాడు.

అయితే ఈ యువ హీరో ఇప్పుడు ప్రేమలో మునిగి తేలుతున్నాడట. అవును నిజమే ఇది అతను చెప్పిన మాటలే. హీరో ఒక బాలీవుడ్ నటిని ప్రేమిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే శేష్ వాటి పై స్పందించలేదు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో, యువ హీరో తాను ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిని చాలాకాలంగా ప్రేమిస్తున్నానని ధృవీకరించాడు.

అయితే  అతను ఆ అమ్మాయి వివరాలను వెల్లడించలేదు. ఎందుకంటే, ఈ విషయంలో తన ప్రేయసి అనుమతి కావాలని చెప్పారు. ఆమెతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. ప్రేమలో ఉన్నప్పటికీ, అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని నటుడు చెప్పాడు. ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాని, అలాంటి సమయంలో కొత్త బాధ్యతలు తీసుకోలేమని అడివి శేష్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss