Thursday, December 2, 2021

Latest Posts

బెంగళూరు జైలులో మృతి చెందిన ఆఫ్రికా జాతీయుడు

African Died In Bangalore Cell

ఆఫ్రికా జాతీయుడు బెంగళూరు జైలులో మృతి చెందడం కలకలం రేపింది. మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన ఆఫ్రికా జాతీయుడు సోమవారం జైలులో మృతి చెందారు. అతని మరణంతో, ఆఫ్రికన్ అసోసియేషన్ సభ్యులు జెసి నగర్ పోలీస్ స్టేషన్ ముందు గుమికూడి నిరసనకు దిగారు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు తమ పోరాటాన్ని బలోపేతం చేయడంతో పోలీసులు వారి పై లాఠీ ఛార్జ్ చేశారు.

దీనితో చాలా మంది నిరసనకారులకు స్వల్ప గాయాలయ్యాయి మరియు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ఇచ్చిన సమాచారం ప్రకారం, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన జోయెల్ షిందాని మాలు(27) ని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే తెల్లవారుజామున ఛాతిలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేయడంతో అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరిలించిన గంటలోనే అతను చనిపోయాడు. అతనికి గుండెపోటు రావడంతో అతను మరణించినట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.

ఈ ఆఫ్రికన్‌ జాతీయున్ని పోలీసులు అరెస్ట్‌ చేసినప్పుడు అతని వద్ద 5 గ్రాములు ఎండీఎంఏ అనే మత్తు పదార్ధం దొరికినట్టు సమాచారం. వీసా కాలపరిమితి ముగిసినా బెంగళూరులో అక్రమంగా ఉంటూ పట్టుబడిన 38 మందిలో అతడు కూడా ఒకడని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss