Home TRENDING ప్లాస్మా థెరపీతో కరోనా నుంచి తేరుకుని డిశ్చార్జి

ప్లాస్మా థెరపీతో కరోనా నుంచి తేరుకుని డిశ్చార్జి

After Plasma Therapy India's First Coronavirus Patient Recovers

After Plasma Therapy India’s First Coronavirus Patient Recovers

కరోనాకు మందు లేకున్నా ,కరోనా సోకిన వ్యక్తులను ప్రాణాపాయం నుంచి వైద్యులు కాపాడుతూనే ఉన్నారు. ఇంకా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో కరోనా వైరస్ బారిన పడి ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్న 49 ఏళ్ల వ్యక్తి ఆదివారంనాడు పూర్తి స్వస్థతతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా వైరస్‌కు ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్న తొలి వ్యక్తి ఇతడే కావడం విశేషం.

ప్లాస్మా థెరపీతో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన రెండు రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఏప్రిల్ 4న ఢిల్లీలోని సాకేత్ ఏరియా ఆసుపత్రిలో ఆ వ్యక్తి చేరాడు. తీవ్ర జర్వం, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన అతనికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. నుమోనియా డవలప్ కావడం, శ్వాస పరిస్థితి కూడా విషమించడంతో ఏప్రిల్ 8న అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

అయితే పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించకపోవడంతో మానవతా దృక్పథంతో ఆయనకు ప్లాస్మా థెరపీ అందించారు. అనూహ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. నాలుగో రోజు వచ్చేసరికి వెంటలేటర్ సాయం లేకుండా పోయింది. దీంతో ఏప్రిల్ 18 వరకూ వైద్యులు సప్లిమెంటరీ ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. పూర్తిగా కోలుకోవడంతో ఆదివారంనాడు ఆయనను డిశ్చార్జి చేశారు.

Exit mobile version