After trisha now kajal Aggarwal say no to chiranjeevi Acharya movie
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై రాంచరణ్, నిరంజన్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే సఘం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ను పరిసీలిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.లాక్ డౌన్ కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకూ హీరోయిన్ లేకుండానే పూర్తి చేసారు. దానికి ప్రధాన కారణం ఈ చిత్రం చెయ్యడానికి ఏ హీరోయిన్ కూడా ముందుకు రాకపోవడమే అని తెలుస్తుంది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడమే అనేది ఇన్సైడ్ టాక్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట త్రిష ను అనుకున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆమె క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. తరువాత కాజల్ ను ఎంపిక చేసారు అని టాక్ నడిచింది. ఇక ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించనప్పటికి… ఇప్పుడు కాజల్ కూడా తప్పుకుంది అనేది తాజా సమాచారం.
ఇటీవల ఓ తమిళ సినిమా కోసం కాజల్ ను సంప్రదించారట. కథ నచ్చినా ప్లాపుల్లో వున్న హీరో తో నటించటం ఇష్టం లేక ఆమె ఒప్పుకోలేదట. అయితే పారితోషికం ఎక్కువగా ఇస్తాము అని నిర్మాతలు భరోసా ఇవ్వడంతో… ‘ఆచార్య’ నుండీ తప్పకుందని తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులకు మాత్రం ‘ఆచార్య’ లో తన పాత్ర నచ్చలేదు అని చెప్పినట్లు సమాచారం.