పిమ్మడి విజయలక్ష్మి అనే పెద్దావిడ తాను ఒక రిటైరేడ్ ఐఏఎస్ ఆఫీసు అని తన ప్రయాణానికి ఒక కార్ అవసరమని అద్దెకు తీసుకుని ఆ కార్ డ్రైవర్ ను కూడా నమ్మించి ఆమెకు దాదాపు 50 ఎకరాల పొలం ఉన్నట్టుగా, తాను ఆ పొలాన్ని కౌలుకు చేసుకోమని నమ్మించి, ఆ అద్దెకు తీసుకున్న ఫోర్డ్ కార్ లో హనుమాన్ జంక్షన్ కు రావడం జరిగింది. కాగా లంచం ఇవ్వాలంటూ లేదంటే షాపుపై చర్యలు తీసుకుంటాం అని నమ్మించి మోసం చేద్దామని చూసిన ఆవిడను చూసి అనుమానం వచ్చిన అక్కడి దుఖానాదారులు ఫోటోలు తియ్యడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కాగా డ్రైవరు ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది.