Agent First Look Poster
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని యొక్క 5 వ చిత్రానికి ఏజెంట్ అనే పేరు పెట్టారు. ఇకపోతే ఈ నటుడి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. సురేందర్ రెడ్డి తన హీరోలను స్టైలిష్ లుక్ ఇవ్వడం కోసం ఇష్టపడతారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా అఖిల్ స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడు. కుర్చీ మీద కూర్చుని సిగరెట్ తాగుతూ అఖిల్ ఇక్కడ మ్యాన్లీగా కనిపిస్తాడు.
అయితే సిక్స్ ప్యాక్ లుక్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూసినప్పటికీ దానికి ఏ మాత్రం తగ్గకుండా ఒక రగ్ లుక్ లో కనిపిస్తున్నాడు అఖిల్. అలానే ఫస్ట్ లుక్ లో T అక్షరాన్ని రూపొందించడానికి గన్స్ మరియు పెన్ కాంబినేషన్ ఉపయోగించారు, అలానే ఏజెంట్ లో అక్షరం E కూడా రివర్స్ లో కనిపిస్తుంది.
వక్కంతం వంశీ రాసిన ఈ చిత్రంలో అఖిల్ సాక్షి వైద్యతో రొమాన్స్ చేయనున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పోతే ఏజెంట్ డిసెంబర్ 24న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి: