Thursday, December 2, 2021

Latest Posts

అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ ఇక లేరు

AIADMK presidium chairman Madhusudhanan passes away

తమిళనాడు అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌(81) గురువారం తుదిశ్వాస విడిచారు. మధుసూదనన్‌ మూడు నెలలుగా వయోభార అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. దివంగత ఎంజీఆర్‌కు వీరాభిమానిగా, ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా, మాజీ మంత్రిగా, పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా అన్నాడీఎంకేలో కీలక పదవుల్లో పని చేసారు. మధుసూదనన్‌ మరణంతో మూడు రోజులు సంతాప దినం పాటించేందుకు నిర్ణయించారు.

14వ ఏట ఉత్తర చెన్నై వేదికగా ఎంజీఆర్‌కు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి 1972లో అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా ఎదిగారు మధుసూదనన్‌.   ఎంజీఆర్‌ మరణం తర్వాత జయలలిత వెన్నంటి నడిచిన ఆయన 1991లో ఆర్కేనగర్‌ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.  తర్వాత జయలలిత, మధుసూదనన్‌ జీవించి ఉన్నంత కాలం ఆయనే పారీ్టకి ప్రిసీడియం చైర్మన్‌ అని ప్రకటించారు. కాగా ప్రిసీడియం చైర్మన్‌ అన్న పదవితోనే చివరి శ్వాసను విడిచారు మధుసూదనన్‌.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss