Monday, April 19, 2021

Latest Posts

దేశ ద్రోహం కింద ఎమ్మెల్యే అరెస్టు

AIDUF MLA Aminul Islam arrested for controversial remarks

కరోనా వైరస్ వ్యాప్తి, క్వారంటైన్ కేంద్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ ఎమ్మెల్యేను పోలీసులు దేశ ద్రోహం నేరం కింద అరెస్టు చేసిన ఘటన అసోం రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆలిండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (ఏఐడీయూఎఫ్‌) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ ఫోన్లో మరో వ్యక్తితో మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లను నిర్భంద కేంద్రాలు అని, చాలా ప్రమాదకరమైనవి అలాగే బీజేపీ సర్కార్ ముస్లిం పట్ల వివక్ష చూపుతోందని అని అన్నట్లు మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి బయటకువచ్చింది .  నిజాముద్దీన్ మార్కజ్ మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితో డాక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నరాని ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి సైతం కావాలనే ఇంజక్షన్లు ఇచ్చి వారిని కరోనా వ్యాధి ఉన్నవారిలా చిత్రీకరిస్తున్నారని అమినుల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అమినుల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈరోజు ఆయన్ను అరెస్ట్ చేశామని మరియు అతని ఫోన్ను కూడా స్వాదినం చేసుకునట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ లో ఉన్న ఆడియో క్లిప్‌ గురించి అరా తీయగా అందులో ఉన్న గొంతు తనదేనని ఒప్పుకునట్లు, మరియు ఆ ఆడియో క్లిప్‌ తానే వాట్సాప్‌ ద్వారా అందరికీ  షేర్ చేసినట్లు అంగీకరించాడని, ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారని, అస్సోం స్పీకర్‌కు ఇందుకు సంబంధించిన సమాచాం ఇచ్చామని ఒక పోలీసులు ఉన్నతాధికారి తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss