Akhil Akkineni Injured On Sets |Most Eligible Bachelor:
సినిమా షూటింగ్స్ సమయంలో రిస్కీ షాట్స్ లో పాల్గొనడం,గాయాల పాలవ్వడం హీరోలకు మామూలే. అలాగే కొన్ని సార్లు రిస్క్ చేయకపోయినా అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే. అయితే తాజాగా అక్కినేని యంగ్ హీరో అఖిల్ తాజాగా షూటింగ్లో గాయపడినట్టు టాక్.
అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` సినిమాలో అఖిల్ నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన హిట్ రాకపోవడంతో కసిగా ఈ సినిమాపై అఖిల్ ఆశలు పెట్టుకుని చేస్తున్నాడు. ఫాన్స్ కూడా హిట్ దక్కాలని ఆశిస్తున్నారు.
ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో అఖిల్‌కు గాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. అఖిల్ కుడి మోచేతికి తీవ్ర గాయమైందని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వైద్యుల సూచన మేరకు అఖిల్ పది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడట. దీంతో `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` షూటింగ్ వాయిదా వేసారట.