Sunday, June 20, 2021

Latest Posts

తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్న అఖీరా నందన్

Akira Nandan Birthday Special Look
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అఖీరా నందన్ ఇప్పటికే యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అకీరా ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. నూనూగు మీసాలతో పాల బుగ్గలతో మెరిసిపోతున్న అఖీరాను చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతుంటారు. అయితే.. ఇవాళ అఖీరా నందన్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ మరింత పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అఖిరాకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ గ్రీటింగ్స్ లో తడిసి ముద్దైపోతున్నాడు అఖీరా.

ఈ సందర్భంగానే పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ తన కుమారుడికి సంబంధించిన పిక్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో అఖీరా ట్రెడిషినల్ దుస్తుల్లో కనిపిస్తున్నాడు. పంచెకట్టు లాల్చీలో అద్దిరిపోయే కటౌట్ లా ఉన్నాడు. ఈ ఫోటోలో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయంటే ఇప్పుడు అఖీరా వేసిన ప్రశ్న తనని తండ్రికి తగ్గ తనయుడు అనేలా చేసింది.

ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే ‘ఆడవాళ్లు చీర కట్టుకోవడం చాలా సాధారణం. మరి మగవారు పంచె కట్టుకుంటే ఎందుకు ప్రత్యేకంగా చూస్తారు’ అని అడిగాడట. దీనికి రేణుదేశాయ్ బదులిస్తూ, అది కేవలం జనాల మైండ్ సెట్ అని కంఫర్ట్ ను బట్టి ఎలాంటి దుస్తులు అయినా వేసుకోవచ్చు అని చెప్పిందట. అయితే పంచె కట్టుకోవడం మన సంప్రదాయం అని తెలిపిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, యూత్ మన సంప్రదాయాలను గుర్తుంచుకోవాలని కూడా గుర్తు చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అఖీరా ఫొటో రేణు కామెంట్ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss