Sunday, July 25, 2021

Latest Posts

ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆలియా ఎంత తీసుకుంటుందంటే?

Alia Bhatt Remuneration For RRR

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లల్లో ఒకరు ఆలియా భట్. ఈమెకు, దక్షిణాది సినిమాలో గొప్ప డిమాండ్ ఉంది.  అయితే గతంలో చాలా సౌత్ సినిమా దర్శకులు ఆమెను సంప్రదించినప్పటికీ, ఆమె ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. అయితే, ఆమెను ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం మాత్రం ఆమె ఒప్పుకుంది.

అయితే ఫాన్సీ ధర కోసం ఆర్‌ఆర్‌ఆర్ చేయడానికి ఆలియా అంగీకరించిందని సమాచారం. నటి మొదట్లో చాలా ఎక్కువ డిమాండ్ చేసిందని, కానీ చాలా చర్చల తరువాత, చివరకు, ఆలియా తన పాత్ర కోసం 5 కోట్లు వసూలు చేసిందని సమాచారం. అయితే ఆలియా కేవలం 10 నుండి 12 రోజులు మాత్రమే ఈ చిత్రంలో చేసిందని ఇందుకోసం ఆమె భారీ పారితోషకం తీసుకుందని టాక్. ఇలా చూస్తే ఆమె  రోజుకు 50 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నందున ఎక్కువ మొత్తం అయినా సరే దానయ్య ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె వల్ల హిందీలో ప్రేక్షకులు ఈ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని చూస్తారని అంచనా వేసింది చిత్ర బృందం. ఇదిలావుండగా, మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర కోసం నటించారు మరియు అజయ్‌కు కూడా భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss