Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

కరోనా ఎఫెక్ట్ : బోసిపోయిన ప్రధాన ఆలయాలు

All major temples closed in AP due to coronavirus:

గ్రహణం వచ్చినపుడు శుద్ధి చేసే సమయంలో ఆలయాల్లో ఒక పూట ఆలయాలు మూసెయ్యడం తెలుసు. కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయాలన్నీ భక్తుల దర్శనం లేక బోసిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో ఏపీలోని కీలకమైన ఆలయాల్లో ఇలా తొలిసారి ఆలయాలను మూసివేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి శుక్రవారం మధ్యాహ్నం వరకు భక్తులను అనుమతించారు. వా రం రోజుల పాటు స్వామివారి దర్శనాలను ఆపివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. శుక్రవారం సుప్రభాతం, అభిషేకం సేవల్లో 809మంది పాల్గొన్నారు. ఆ తరువాత 265మంది వీఐపీ బ్రేక్‌ టికెట్లు ఉన్నవారు, శ్రీవాణి ట్రస్టు దాతలు స్వామిని దర్శించుకున్నారు. స్లాటెడ్‌ టోకెన్లు లేకపోయినా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతిస్తామని ప్రకటించడంతో భక్తులు, స్థానికులు నారాయణగిరి ఉద్యానవనం నుంచి క్యూలోకి ప్రవేశించి గంట వ్యవధిలో దర్శనం చేసుకున్నారు.

సరిగ్గా ఒంటిగంటకు క్యూలైను ప్రవేశం మూసివేశారు. అప్పటిదాకా మొత్తం 5,684 మంది సామాన్య భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం బంగారువాకిలి వద్ద పరదా మూసివేసి, ఆలయ ఉద్యోగులు, టీటీడీ సిబ్బందికి కూడా సన్నిధి వద్దకు అనుమతి నిరాకరించారు. జియ్యంగార్లు, ఏకాంగులు, అర్చకస్వాములు తదితర కైంకర్యపరులు మాత్రమే సన్నిధికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. శ్రీవారికి యధావిధిగా అర్చనలు జరుగుతాయి తప్ప భక్తలకు ప్రవేశం నిషిద్ధం. దీంతో ఎప్పుడూ కిటకిటలాడే తిరుమల సన్నిధి ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది. అంతేకాదు తిరుమలలోని వివిధ మఠాలు కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న ‘మనగుడి’ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి దర్శనాలు నిలిపివేశారు. ఈ నెల 31వరకు భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించరు. ఇంద్రకీలాద్రి చరిత్రలో భక్తుల దర్శనాలు ఇన్నిరోజులు నిలిపివేయడం ఇదే తొలిసారి. శ్రీశైలంలో ఈ నెల 31 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించడంతో స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. కాగా, శ్రీశైల ఆలయంలోకి భక్తులను 11 రోజు ల పాటు అనుమతించకపోవడం ఇదే తొలిసారి. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి బృందావన దర్శనం శుక్రవారం నుంచి నిలిపివేసి, ఈ నెల 31వరకు మఠం ముఖద్వారం, దర్శన ద్వారాలు మూసివేశారు.శ్రీకాకుళంలో అరసవల్లి ఆదిత్యుడి ఆలయాన్ని 300ఏళ్ల కిందట నిర్మించగా, కరోనా ఎఫెక్ట్‌ తో తొలిసారి స్వామి దర్శనానికి బ్రేక్‌ పడింది. ఈ నెల 31 వరకు తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...