All parties participate local body elections in ap:
ఏపీలో మండల,జిల్లా ప్రజా పరిషత్ లు,పంచాయితీలు,మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్కువ స్థానాలు గెలిస్తేనే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజా మద్దత్తు ఉన్నట్టని అందుకే అన్నిచోట్లా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని వైసిపి ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చింది. మంత్రులు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోతే రాజీనామా చేయాల్సిందేనని,వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా రాదని ఇప్పటికే వైసిపి నేతలకు సీఎం జగన్ సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు.
ఇక ఇప్పటికే తెలుగుదేశం అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు వీలుగా నియోజకవర్గ కన్వీనర్లకు వర్తమానం పార్టీ అధిష్టానం పంపింది. పైపై బెదిరింపులకు పారి పోవద్దని, గెలుపు మనదేనని అధికారపక్ష వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ అధిష్ఠానం పేర్కొంటూ ఇప్పటికే కొందరిని బుజ్జగించింది. జనసేన,తో కల్సి పోటీకి బిజెపి సమాయత్తం అవుతోంది. మొత్తం మీద అన్ని పార్టీలు స్థానిక ఎన్నికలను సవాల్ గా తీసుకుంటున్నాయి. అయితే ఓపక్క నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న, దీనికి ధీటుగా అభ్య ర్థులను చాలా మండలాల్లో టిడిపి ఖరారు చేయలేదు.
ఇంకొన్ని మండలాల్లో రిజర్వేషన్లు తారుమారు కావడంతో ఈ మేరకే అభ్యర్థులను ఒప్పించి, మెప్పించడానికి నేతలంతా తలమునకలై ఉన్నారు. కీలకమైన మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇక వైసీపీ అధిష్టానం ఈ మేరకు ఒకింత వేగంగానే స్పంది స్తోంది. వైసీపీ మాత్రం గుట్టుగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. వీలైతే వీరంతా మంగళ, బుధవారాల్లోనూ తమ నామినేషన్లు దాఖలు చేసేలా దాదాపు వ్యూహం ఖరారైంది. తెలుగు దేశంతో సహా మిగతా పార్టీల అభ్యర్థుల జాబితాలను బట్టే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఇప్పటికే ఇద్దరు పేర్లతో కూడిన జాబితాను వైసీపీ పరిశీలించింది. వారి బలాబలాలను సమక్షించి తుది జాబితాకు మెరు గులు దిద్దింది. మొత్తానికి స్థానిక ఎన్నికలు రసవత్తరంగా మారాయి.