Monday, July 26, 2021

Latest Posts

‘నాంది’ తో ఉత్కంఠం రేపుతున్న అల్లరి నరేష్

అటు కామెడీ పాత్రలతో పాటు ఇటు విలక్షణ పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న అల్లరి నరేష్ త్వరలో “నాంది”  అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. కొంత కాలం క్రితం ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయగా తాజాగా అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా యువ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘నాంది’ ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరట గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు సినిమా యూనిట్. హీరో విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా మాట్లాడుతూ ”ఈ ప్రపంచాన్ని టీజర్‌ రూపంలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘నాంది’ చిత్ర బృందానికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు. నరేష్‌ అన్న ఇందులో మీరు అద్భుతంగా ఉన్నారు” అని అన్నారు.

ఈ చిత్రంతో హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల దర్శకుడిగ పరచయం అవ్వుతూండగా, నరేష్ కెరియర్‌లో 57వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నది. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈచిత్రానికి అబ్బూరి రవి, చోటా కె. ప్రసాద్‌, శ్రీచరణ్ పాకాల, బ్రహ్మ కడలి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, హరీష్ ఉత్తమన్‌, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.వినూత్న కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss