Thursday, May 13, 2021

Latest Posts

అల్లు అర్జున్ ని “బే” అన్న కూతురు ఆర్హ

Allu Arjun And His daughter Aarha Cute Reply Video:

  అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. బాహుబలి రికార్డ్స్ తప్ప మిగిలిన అన్నింటి రికార్డ్స్ క్రాస్ చేసిన ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు పూజ హెగ్డే నటించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నూట యాభై కోట్లకు పైగా షేర్ 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్న అల్లు అర్జున్ తన కూతురు ఆర్హతో ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ తన కూతురు ఆర్హ, కొడుకు అయాన్ తో కలిసి ఉన్న వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే బన్నీ పంచుకుంటాడు.

  అల్లు అర్జున్ వాళ్లతో ఎలా గడుపుతాడో ఈ వీడియోస్ చుస్తే తెలుస్తుంది. ఇది ఇలా ఉంటె తన పిల్లలతో చేసే అల్లరి అంతా ఇంతా కాదు, వాళ్ళిద్దరితో అల్లు అర్జున్ వాళ్ళకంటే చిన్న పిల్లాడిలా మారిపోయి ఆడుతూ ఉంటాడు. ఈ వీడియోలో బన్నీ తన కూతుర్ని నీకు ఇష్టమైన కలర్ ఏంటి అని అడగగా, దానికి సమాధానంగా పింక్ “బే” అని సమాధానం ఇచ్చింది. దానికి బన్నీ నన్నే “బే” అంటావా సొంత నాన్నని “బే” అంటావా అంటే… అంటాను “బే” అని రిప్లై ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందానతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss