Allu Arjun Makeup For Pushpa Film
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ ప్రస్తుతం తమ తొలి పాన్-ఇండియా ప్రాజెక్ట్ పుష్పలో పనిచేస్తున్నారు. అయితే ఎప్పుడు స్టైల్ గా కనిపించే అల్లు అర్జున్ ఈ చిత్రంలో లారీ క్లీనర్ పాత్రలో నటిస్తున్నాడు. బన్నీ ఏ పాత్ర కోసమైనా తన యొక్క రూపాన్ని మరియు శరీరాన్ని ఆ పాత్రకు మలుచుకుంటాడు అన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పనినే చేస్తున్నాడు అల్లు అర్జున్.
ఈ స్టార్ హీరో మేకప్ వేసుకోవడానికి రోజుకు రెండు గంటలు, టేకాఫ్ చేయడానికి గంటన్నర గడుపుతున్నట్లు సమాచారం. అతను లారీ క్లీనర్ గా కనిపించడం కోసం రోజు ఫుల్ గా టాన్ అవుతున్నట్టు సమాచారం. అంటే కాదు అల్లు అర్జున్ జుట్టు, కనుబొమ్మలు, మీసాలు, గడ్డంతో సహా ప్రతి విషయంలో రోజువారీ కూలీగా కనిపించడం కోసం దానికి కావల్సిన ప్రతీ విషయాన్ని అతను పట్టించుకుంటున్నాడు.
తన మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్ పుష్ప తన కెరీర్‌పై గొప్ప ప్రభావాన్ని చూపుతుందనే విషయంతో అల్లు అర్జున్ ఎప్పటి కంటే మరింత కష్ట పడుతున్నాడని సమాచారం. అయితే అల్లు అర్జున్ డెడికేషన్ చూసి దర్శక నిర్మాతలు ఈ స్టార్ హీరో త్వరలోనే పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా మారిపోతాడని అంటున్నారు.
ఇక పోతే ఈ పుష్ప ఆగస్టు 13 న విడుదల కానుంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మరియు మైత్రి మూవీ మేకర్స్, ముత్తాంశెట్టి మీడియా దీనిని నిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: