Wednesday, April 21, 2021

Latest Posts

బుట్ట‌బొమ్మ‌ అంటూ స్టెప్లు వేసిన వార్న‌ర్ దంపతులు

Allu Arjun Reacted on Butta Bomma Song of David Warner

కరోనా వైరస్ కార‌ణంగా అంద‌రూ ఇళ్ల‌కు ప‌రిమితమై  ఉన్నారు. అలాగే ఐ‌పి‌ఎల్ కూడా వాయిదా పడటం తో క్రికెటర్లు కూడా ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. ఇళ్ల‌కే  పరిమితమై ఉన్న   సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా కార్య‌క‌ల‌పాలు వాయిదా ప‌డ‌టంతో సెల‌బ్రిటీలతో  స‌హా ఎంతోమంది సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. అలాగే  సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తనకు సంబంధించి అప్‌డేట్స్‌ని ప్రతీ రోజు అభిమానులతో పంచుకుంటున్నాడు.  ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్న‌ర్ చాలాకాలంగా టిక్‌టాక్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వాటిలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం వార్న‌ర్ త‌న కూతురితో కలసి బాలీవుడ్ సాంగ్ షీలా కీ జ‌వానీ అనే పాట‌కు డ్యాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా తెలుగు పాట‌ల‌కు త‌న భార్య క్యాండిస్‌తో క‌లిసి స్టెప్లులేసిన వీడియో వైర‌లైంది. ప్ర‌ముఖ తెలుగు సినిమా అలా వైకుంఠ‌పురంలోని సూప‌ర్‌హిట్ సాంగ్ బుట్ట‌బొమ్మ‌కు వార్న‌ర్ దంపతులు డ్యాన్స్ చేసి తెలుగు క్రికెట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ వీడియోలో వార్న‌ర్‌.. క్యాండిస్‌తో హుషారుగా బుట్ట‌బొమ్మ‌ సాంగ్  సిగ్నేచర్ స్టెప్‌ని వేశారు. ఈ వీడియోలో వాళ్ల కూతురు కూడా క‌న్పించింది. దీనిపై అలా వైకుంఠ‌పురంలో హీరోగా న‌టించిన అల్లు అర్జున్ తమ సినిమాలోని పాట‌కు డ్యాన్స్ చేసినందుకుగాను కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss