Thursday, December 2, 2021

Latest Posts

మలయాళ సినిమా పై కన్నేసిన అల్లు అర్జున్

Allu Arjun To Remake Nayattu In Telugu

మలయాళంలో ఈ సంవత్సరం విడుదలైన సూపర్ సక్సెస్ ఫుల్ మలయాళ చిత్రాలలో ‘నయట్టు’ ఒకటి. కుంచాకో బోబన్, జోజు జార్జ్ మరియు నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ అందరి నుండి ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. అంతే కాదు తెలుగు రీమేక్ హక్కులను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తీసుకున్నట్లు చిత్ర దర్శకుడు మార్టిన్ ప్రక్కట్ అధికారికంగా ధృవీకరించారు. అతని హోమ్ ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ రీమేక్ హక్కులను తీసుకుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి గీతా ఆర్ట్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీని కోసం దర్శకుడిని వెతికే పనిలో పడ్డారట. మరోవైపు, జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ వెర్షన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. తమిళ రీమేక్ ని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించనున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss