Sunday, June 13, 2021

Latest Posts

సామాజిక దూరం పాటిస్తూ అమరావతి రైతుల ఆందోళన

Amaravati farmers agitated over social distance

కరోనా వైరస్‌ ప్రభావం విజృంభిస్తున్నప్పటికీ అమరావతి  రాజధాని రైతుల  ఆందోళన లు మాత్రం ఆగలేదు. సామాజిక దూరం పాటించాలని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రైతులు, మహిళలు తమ నివాసాలనే నిరసన శిబిరాలుగా మార్చుకుని రాజధాని పోరు కొనసాగించారు. ఇంటి ఆవరణలలోనే దూరం దూరంగా కూర్చుని, ముఖానికి మాస్కులు కట్టుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు, ఆందోళనలు 102వ  రోజుకు చేరాయి. రాజధాని గ్రామాల్లో వాడవాడలోనూ నిరసనలు నడుస్తున్నాయట.

ఇళ్ల ముందున్న అరుగులపై కూర్చొని కరోనా  వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగడంతో సీఎం జగన్మోహనరెడ్డితో పాటు, ఇతర మంత్రులు వస్తున్నారంటూ మందడం గ్రామంలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. దీక్షా శిబిరంలో రైతులు లేకపోయినా భారీగా పోలీసులను మోహరించారు. సమావేశం అయిపోయి తిరిగి సీఎం, మంత్రులు వెళ్లేదాక గ్రామంలో ఆంక్షలు కొనసాగించారు. అయితే పోలీసులు మాస్కులు లేకుండా గుంపులు, గుంపులుగా తిరగటాన్ని రైతులు ప్రశ్నించారు.

కాగా ‘రాజధాని గ్రామాల్లో కరోనా ఎఫెక్ట్‌’ అంటూ సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రైతులు, మహిళలు మండిపడ్డారు. ‘రాజధాని గ్రామాల్లో 21 మం దికి కరోనా లక్షణాలు’-‘పూర్తిస్థాయి సమాచారంతో రంగంలోకి పోలీసులు’ అంటూ బ్రేకింగ్‌ న్యూస్‌ సృష్టించి నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాజధానిపై ప్రభుత్వ తీరు మార్చుకోవాలంటూ రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ నిలిపి కొవ్వుతులు వెలిగించి ‘అమరావతి వెలుగు’ పేరిట మహిళలు నిరసన వ్యక్తం చేశారు.  మహిళలు, రైతులు కొవ్వొత్తులు పట్టుకొని ‘జై అమరావతి’ నినాదాలు చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss