Tuesday, April 13, 2021

Latest Posts

అమెజాన్ కు గట్టి షాక్ సి‌ఈ‌ఓ గా దిగిపోనున్న జెఫ్ బెజోస్

Amazon CEO To Quit

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ ఏడాది అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆండీ జాస్సీ అతని స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన జెఫ్ బెజోస్ 1995 లో అమెజాన్ స్థాపించినప్పటి నుండి CEO గా ఉన్నారు.  అయితే తాజాగా ఈ స్థానం నుండి తప్పుకోనున్నట్టు ఆయన సంచలన ప్రకటన చేశారు.

అమెజాన్ కి రానున్న కొత్త సి‌ఈ‌ఓ ఆండీ జాస్సీ 1997 నుండి అమెజాన్ కోసం పనిచేస్తున్నారు. అలానే  అతను అమెజాన్ యొక్క క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క CEO. తాజాగా ఈ సంస్థ యొక్క నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికలో భాగంగా అమెజాన్ సిఇఒగా జెఫ్ బెజోస్ పదవీవిరమణ గురించి వెల్లడించారు. జెఫ్ బెజోస్ ఈ ఏడాది చివర్లో పదవీవిరమణ చేయడం గురించి అమెజాన్ ఉద్యోగులకు ఒక ఇమెయిల్ పంపడం విశేషం.

ఇకపోతే సీఈవోగా తప్పుకున్నప్పటికీ అమెజాన్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తాను కూడా పాలుపంచుకుంటానని ఈ లేఖలో పేర్కొన్నారు. రిటైర్‌మెంట్ తర్వాత సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss