Sunday, June 13, 2021

Latest Posts

ఆ యిద్దరూ కలిసి లంచ్ – ఒడిస్సా సీఎం ట్వీట్ వైరల్

Amit Shah, Mamata face-to-face at Patnaik’s lunch

ఆ యిద్దరూ కలిసి లంచ్ – ఒడిస్సా సీఎం ట్వీట్ వైరల్

రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా విమర్సించుకున్న వాళ్ళు కలిసి భోజనం చేసే పరిస్థితిలు కూడా వస్తుంటాయి. తాజాగా ఓ ఇద్దరు నేతలు కలిసి ఇలాగే లంచ్ చేయడంతో అది వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసం ‘నవీన్ నివాస్’ వేదికగా ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ విభేధాలతో నిత్యం కత్తులు దూసుకునే నేతలు ఇవాళ కలిసికట్టుగా ఒకే టేబుల్‌పై లంచ్ చేస్తూ కనిపించారు.

naveen patnaik

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విందులో పాల్గొన్నారు. ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ (ఈజెడ్‌సీ) సమావేశం సందర్భంగా ఇవాళ అమిత్ షా, మమతా బెనర్జీ భువనేశ్వర్ వచ్చారు. అమిత్ షా సారధ్యంలో జరిగిన ఈ సమావేశానికి నవీన్ పట్నాయక్, నితీశ్ కూడా హాజరయ్యారు. అయితే జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ మాత్రం ఈ సమావేశానికి రాలేదు.ఈ సందర్భంగా ఈజెడ్‌సీ వైస్ చైర్మన్ నవీన్ పట్నాయక్ మధ్యాహ్నం తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు.

అనంతరం వీరంతా కలిసి భోజనం చేస్తున్న ఫోటోని సీఎం నవీన్ పట్నాయక్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ‘‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నా సహచర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులతో కలిసి నవీన్ నివాస్‌లో గడపడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో వండిన కొన్ని వంటకాలతో అందరం కలిసి ముచ్చటించుకుంటూ గడిపిన సమయం అద్భుతంగా అనిపించింది…’’ అని నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫోటో విపరీతంగా వైరల్ అయింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss