Amit Shah Strong Counter on Delhi Riots:
అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్బంగా ఢిల్లీలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెల్సిందే. ఈ హింసాకాండపై అధికార విపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. ఇక పార్లమెంట్ సమావేశాల సందర్బంగా లోక్సభ దద్దరిల్లింది. ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఏ నేపధ్యంలో అధికార పక్షం నుంచి అమిత్ షా బలమైన కౌంటర్ ఇస్తూ, ప్రధానంగా కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో చనిపోయిన వారందరూ భారతీయులేనని, వారిని హిందూ-ముస్లింలుగా తాము చూడడం లేదని అమిత్ షా స్పష్టంచేశారు.
ఢిల్లీ అల్లర్లకు బాధ్యతగా అమిత్ షా రాజీనామా చేయాలంటూ సభలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి అమిత్ షా గట్టిగానే బదులిస్తూ, ‘‘అల్లర్ల గురించి ఒక పాత రాజకీయ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో మరణించిన శరణార్థుల్లో 76 శాతం కాంగ్రెస్ హయాంలోనే మరణించారు. అలాంటి కాంగ్రెస్ మమ్మల్ని ప్రశ్నిస్తోంది. మా నైతిక విలువలు లెక్కకడుతోంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.