Monday, May 10, 2021

Latest Posts

తీరం దాటిన అంఫన్ తుఫాన్, తప్పిన పెను ప్రమాదం

సూపర్ సైక్లోన్‌గా పేర్కొన్న అంఫన్ తుఫాన్ ఈ రోజు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో సమీపంలో తీరం దాటింది. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి తీరం దాటే ప్రక్రియ ప్రారంభమై రాత్రి 7 గంటలకు పూర్తిగా తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 160 కి.మీల వేగంతో భీకర గాలులు విశాయి, తర్వాత కూడా గంటకు 110 కి.మీ. నుంచి 120 కి.మీ. వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు.

ఆ గాలులకు పశ్చిమ బెంగాల్‌లో 5500 ఇళ్లు నేలమట్టం అవ్వగా, భారీ వృక్షాలు వేర్లతో సహా లేచి రోడ్లకు అడ్డంగా పడటంతో అక్కడ ఉన్న కార్ల, ఇళ్ళు, విద్యుత్‌, టెలిఫోన్‌ స్తంభాలు నేలకూలాయి. అయితే కొంత మేరకు ప్రాణ నష్టం  జరిగినట్లు  తెలుస్తుంది.  దీంతో పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో హై అలర్ట్‌ కొనసాగించి, సహాయక చర్యల కోసం 41 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఇక బెంగాల్‌లో 5 లక్షల మందిని, ఒడిశాలో 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది. అలాగే బెంగాల్‌ – బంగ్లాదేశ్‌ మధ్య సుందర్బన్‌ సమీపంలో ఈ అతి తీవ్ర తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే విశాఖపట్నం, కోస్తా ఆంధ్రాలో కూడా ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికి ఎటువంటి ప్రభావం చూపించలేదు. మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయిని వాతావరణ శాఖ చెప్పినప్పిటికీ అవి కూడా పడకపోవటం గమనార్హం.

 

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss