Tuesday, January 25, 2022

Latest Posts

బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అమీ జాక్సన్?

Amy Jackson Cancels Marriage With Boyfriend

ఎవడు, నవ మన్మదుడు, 2.0 మరియు ఐ చిత్రాలతో తెలుగు వెండి తెర పై మెరిసిన తార అమీ జాక్సన్. అయితే గత రెండు సంవత్సరాలుగా, ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి లండన్లో తన కుటుంబ జీవితాన్ని గడుపుతోంది.

ఇక తన కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే అమీ 2019 లో జార్జ్ పనాయొటోని నిశ్చితార్థం చేసుకుంది. అదే సంవత్సరంలో ఈ హీరోయిన్ ఒక పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ జంట 2020 లో వివాహం చేసుకోవాలని అనుకున్నారు, కాని కోవిడ్ కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమీ తన ప్రతీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. అయితే, ఆమె ఇప్పుడు జార్జ్‌తో ఉన్న చిత్రాలన్నింటినీ తన సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి తొలగించింది. దీనితో వారిద్దరు విడిపోయారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ విషయం పై నటి గానీ, ఆమెకు కాబోయే భర్త కాని స్పందించలేదు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss