Tuesday, May 18, 2021

Latest Posts

చిత్తూరు జిల్లాలో అద్భుతం ….

An amazing event took place in Chittoor district

చిత్తూరు జిల్లాలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లితో పాటు18 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న ఆమె  కుమారుడికి కరోనా సోకపోవడం అక్కడ వారీనందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వైద్యులు ఇదో అద్భుతంగా వర్ణిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే ఢిల్లీలో మర్ఖగ్  మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఒకరికి ఈ నెల 5న కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌ కు తరలించారు.

వారికి పరీక్షలు నిర్వహించగ ఆయన తమ్ముళ్లకు మరియు వారి భార్యలకు పాజిటివ్‌ వచ్చింది, దీంతో వారందరినీ 8న చిత్తూరులోని  కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో చిన్న తమ్ముడుకు ఏడాది బాలుడు ఉన్నాడు. వారందరూ క్వారంటైన్‌లో ఉండటంతో ఏడాది బాలుడ్ని తన వెంటే తెచ్చుకుంది ఆ బాలుడి తల్లి. వారందరికి కరోనా సోకడంతో బాబును వారి వద్ద ఉంచుకోవడానికి ఎవరు సాహసించలేదు. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి బాబును అప్పగిద్దామంటే నిరాకరించిన ఆమె తనవద్దే ఉంచుకుంది బాలుడి తల్లి.

కాగా తల్లితో పాటు  కోరంటైన్ లో ఉన్న బాలుడికి దాదాపు నాలుగు సార్లు వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు.  తప్పనిసరి పరిస్థితుల్లోనే తన వద్ద ఉంచుకుని, రోజూ ఆవు పాలను పట్టేదాన్ని అని బాబు తల్లి చెప్పుచున్నారు. చిన్నారులకు వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుందని, కరోనా పాజిటివ్‌ వచ్చిన తల్లి వద్ద 18 రోజులున్నా బాబు సురక్షితంగా బయటపడడం సంతోషకరమైన అంశమని  కలెక్టర్‌ భరత్‌గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. తల్లికి కూడా వరుసగా రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. తల్లీ, కుమారుడిని అధికారులు జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుంచి  డిశ్చార్జ్ చేసి, నగరిలోని వారి ఇంటికి తరలించారు. వీరితో పాటు మరో మహిళ కూడా డిశ్చార్జ్ అయ్యారు.  డిశ్చార్జ్ అయిన  వీరు మరో 14 రోజుల పాటు ఇళ్లలోనే హోం కోరంటైన్ లో ఉండాలని నగరి సీఐ మద్దయ్యచారి తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss