Sunday, June 20, 2021

Latest Posts

ఆనందయ్య మందు అందుబాటులోకి ఈ రోజు నుంచి వచ్చేస్తుంది

Anandaiah Covid Medicine Delivery Start Date

ఆనందయ్య కరోనా మందుకి ఆంధ్రా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటినుంచి ఈ మందు ప్రజలకి అందుతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఆనందయ్య బృందం శుభవార్త తెలిపింది. ఈ మందు ఈ నెల 7 నుండి అందుబాటులోకి రానుంది. childeal.in అనే వెబ్‌సైట్ ద్వారా ఈ ఔషధ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు వెబ్‌సైట్‌ వివరాలను అధికారికంగా వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే కొరియర్ ద్వారా ఆనందయ్య కరోనా మందు ఇంటి వద్దకే పంపిణీ చేయబడుతుంది. ఇటీవల, ఈ మందు తయారీ విభాగాన్ని నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం నౌకాశ్రయంలోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణానికి మార్చారు.

మరోవైపు, ఆన్‌లైన్‌లో పంపిణీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికే బ్లూడార్ట్ కొరియర్ సంస్థతో మాట్లాడారు. ఐ డ్రాప్స్ మినహా ఆనందయ్య తయారుచేసిన ఇతర మందుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss