Sunday, June 20, 2021

Latest Posts

ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం

Anandaiah Medicine Get Approved

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య మందు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, ఏపీ ప్రభుత్వం కోటయ్య మరణం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందు తీసుకున్న వ్యక్తి మొదట కోలుకున్నట్లుగా కనిపించినా తరువాత అతని ఆరోగ్యం క్షీణించి నిన్న మరణించాడు.

అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు, ఏపీ ప్రభుత్వం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (సిసిఆర్ఎఎస్) నివేదికను తీవ్రంగా పరిశీలించింది. అయితే, కంటి నుంచి ఇచ్చే మందును  మాత్రం ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ని 2 లేదా మూడు రోజుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దీని పై తుది నిర్ణయం తీసుకున్నారు.

ఆయుర్వేద రిపోర్ట్స్ ఆనందయ్య మందు గురించి ఏం చెప్పాయంటే కోవిడ్ మందుని ఇది తగ్గిస్తుందని సరైన ఆధారాలు లేవని తెలిపింది. అయితే ఈ మందులు వాడినప్పటికీ మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయరాదని చెప్పింది. మరి కరోనా ని నిషేధిస్తుంది అని ఆధారాలు లేనప్పుడు ఈ మందుని ఎందుకు ఒప్పుకున్నారో ప్రభుత్వానికే తెలియాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss