Sunday, June 20, 2021

Latest Posts

నెల్లూరు ఆనందయ్య కరోనా మందు పై పాజిటివ్ రిపోర్ట్

anandayya medicine for covid 19

నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం జరగనుంది. ఆనందయ్య, రాములు ఎదుట ఆయుర్వేద మందు తయారీని చూపించనున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రాములు మీడియాతో మాట్లాడుతూ, నిన్న ముత్తుకూరులో కొంతమందితో, ఆనందయ్య వద్ద పనిచేసేవారితో మాట్లాడామని తెలిపారు.

ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పూర్తిగా పరిశీలిస్తామని రాములు పేర్కొన్నారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. మందు తయారీ పదార్థాలపై ల్యాబ్‌ నుంచి పాజిటివ్ రిపోర్టే వచ్చిందని రాములు వెల్లడించారు. ఆనందయ్య మందును తీసుకున్నవారి పై కూడా టెస్ట్ లు చేస్తామని చెప్పారు.

ఐసీఎంఆర్ బృందం పరిశీలిన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేస్తామని, అయితే మందు తయారీ అధ్యయనం నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టొచ్చని.. ఫైనల్‌గా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ సాధ్యమవుతుందని ఆయన వివరించారు. అప్పటి వరకు ప్రజలెవరూ నెల్లూరు వెళ్లొద్దని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss