బుల్లితెర పై యాంకర్ గా ఇరగదీస్తూ వెండి తెర పై అవకాశాలు కొట్టేసింది అనసూయ. వెండి తెర పై ఇప్పటికే చాలా సినిమాల్లో కూడా చేసెసింది. ఇంతకుముందు రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా మెప్పించి యువతరంలో గొప్ప ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా పుష్ప సినిమాలో కూడా నటిస్తునట్టు సమాచారం.
కెరీర్ పరంగా, బుల్లి తెర పై కానీ, వెండి తెర పై కానీ అనసూయ స్పీడ్ ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఇప్పుడు ఓ ప్రయోగాత్మక పాత్రకు సంతకం చేసింది. హీరో గోపిచంద్ తో మారుతి తెరకెక్కించనున్న తాజా చిత్రంలో అనసూయ వేశ్య పాత్రలో నటించేందుకు అంగీకరించింది. తన కెరీర్ లోనే ఇది ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుందని ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ కి అనసూయ సంతకం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రంలో గోపి చంద్ కి జోడీ గా రాశీ ఖన్నా నటించనుంది.
అంతే కాదు అనసూయ విజయ్ సేతుపతి సినిమాలోనూ బోల్డ్ ఐటెమ్ గాళ్ సిల్క్ స్మిత పాత్రలో నటిస్తోందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇక ఈ అమ్మడి జోరు వెండి తెర పై తట్టుకోవడం కష్టమే. జీఏ2 పిక్కర్స్- యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఇవి కూడా చదవండి: