బుల్లి తెర యాంకర్ నుంచి వెండి తెరకు పరిచయమైన నటి అనసూయ భరద్వాజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రంగస్థలం లో రంగమ్మత్తగా తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకుంది. త్వరలో, ఆమె ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ మరియు లావణ్య త్రిపాఠి నటించబోయే చిత్రం చావు కబురు చల్లగాలో ప్రత్యేక పాట చేసినట్లు తెలిసింది.
ఇకపోతే ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లాపతి దర్శకత్వం వహించారు మరియు బన్నీ వాస్ నిర్మాణంలో జిఎ 2 పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా అనసూయ భరద్వాజ్ ను స్పెషల్ పాట గురించి ఆమెను అడిగినప్పుడు, ” ఇక పై అలాంటి పాటలు చేయను అని చెప్పింది”.
చావు కబురు చల్లగా చిత్రానికి ప్రత్యేక పాట కోసం తాను అంగీకరించినట్లు అనసూయ వెల్లడించింది. ఎందుకంటే ఈ పాటను కొరియోగ్రాఫ్ చేసిన జానీ మాస్టర్ మంచి ఫ్రెండ్ అని అందుకే ఒప్పుకున్నట్లు చెప్పింది. ఇక పై సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నటి తెలిపింది. అనసూయ అంటే మంచి పాత్రలతో ప్రేక్షకులు గుర్తుంచుకోవాలని ఆమె కోరుకుంటుంది.
ఇవి కూడా చదవండి: