Sunday, June 20, 2021

Latest Posts

నాన్న చేసిన పిచ్చి పని వల్ల ఆస్తి మొత్తం పోయింది – యాంకర్ అనసూయ

Anchor Anasuya Struggle In Real Life

తెలుగు యాంకర్లలో ఘాటు యాంకర్ ఎవరు అంటే అది అనసూయ భరద్వాజ్‌ అని ఎవరైనా చెప్తారు. తన మాటతీరు, వేషధారణ, కుటుంబం.. ఇలా తనకు సంబంధించిన ఏ విషయాల్లో జోక్యం చేసుకుని మాట్లాడినా వారిని మాటల తూటాలతో ఎన్‌కౌంటర్‌ చేసి పాడేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ యాంకర్‌ తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాల్యంలో తాను అనుభవించిన కష్టాలను చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

తాము ధనవంతులమేనని, కాకపోతే నాన్న గారికి జూదం పిచ్చి ఉండేదని చెప్పింది. తాము స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని తండ్రి మరీ మరీ చెప్పేవారని తెలిపింది. ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నా?, వాళ్లను ఎలా హ్యాండిల్‌ చేస్తున్నాం? అనేది కూడా దూరం నుంచి ఆయన ఓ కంట కనిపెడుతుండేవారని అనసూయ వెల్లడించింది. అయితే ఆయన జూదంలో మొత్తం ఆసి పోగొట్టడం వల్ల అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చిందని తెలిపింది.

అయితే అనసూయ వాటన్నిటినీ దాటుకుని ప్రస్తుతం టాప్ రేంజ్ యాంకర్ గా కొనసాగుతుంది. ఇకపోతే అనసూయ ముఖ్య పాత్రలో నటించిన ‘థాంక్‌ యూ బ్రదర్‌’ సినిమా నేటి నుంచి ఆహాలో ప్రసారం కానుంది. అలానే టాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌లో కలిపి సుమారు 6 ప్రాజెక్టులతో అనసూయ బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss